రేవంత్ రెడ్డి సీఎం ప్రకటనతో కాంగ్రెస్ నాయకుల హర్షం

నవతెలంగాణ-భిక్కనూర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి పేరు ప్రకటన చేయడంతో మండల కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా డిసిసి ఉపాధ్యక్షులు మద్ది చంద్రకాంత్ రెడ్డి, మండల అధ్యక్షులు భీమ్ రెడ్డి మాట్లాడుతూ బిఆర్ఎస్ పాలనలో బందీగా ఉన్న తెలంగాణ రాష్ట్ర బానిస సంకెళ్లను తెంచిన టి పి సి సి అధ్యక్షులు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి చేయడం పట్ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు , సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కి రుణపడి ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గాల్ రెడ్డి, అంకం రాజు, తదితరులు ఉన్నారు.