తెలంగాణ రాష్ట్ర మత్స్య శాఖ కార్యాలయంలో రాష్ట్ర మత్స్య సొసైటీస్ ఫెడరేషన్ చైర్మన్గా శ్రీ మెట్టు సాయికుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారిని శనివారం అక్బర్ పేట్ భూంపల్లి మండల కాంగ్రెస్ నాయకులు,ఫిషర్మెన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేపాక తిరుపతి ముదిరాజ్, దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్, అక్బర్ పేట భూంపల్లి ఫిషర్ మెన్ మండల అధ్యక్షుడు అన్నబోయిన చంద్రశేఖర్ పూల బోకే అందించి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పంజా నరేష్, అక్కపల్లి పరమేష్ గౌడ్, వేల్పుల యాదగిరి ముదిరాజ్, జంగి బిక్షపతి, షేర్ పల్లి స్వామి, అన్నబోయిన ప్రభాకర్, పిట్ల భూపతి, నీల నరేష్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.