సీసీ రోడ్డు పనులకు భూమి పూజ చేసిన కాంగ్రెస్ నాయకులు

నవతెలంగాణ – జక్రాన్ పల్లి

జక్రాన్ పల్లి మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా సిసి రోడ్డు పనులకు కాంగ్రెస్ నాయకులు భూమి పూజ చేశారు. రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే  శ్రీ డా ఆర్. భూపతిరెడ్డి  సహకారంతో మండలం లోని బ్రాహ్మణ పల్లి గ్రామానికి అభివృద్ధికి రూ.5 లక్షల రూపాయలు మంజూరు చేయడం వలన  బ్రాహ్మణ పల్లి గ్రామంలో రూ. 5 లక్షల విలువ గల సీసీ రోడ్డు పనులు ప్రారంభించడం జరిగింది. గెలిచినా అనతి కాలంలోనే గ్రామ అభివృద్ధికి సహకరించిన ఎమ్మెల్యే కి గ్రామ నాయకులు  ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో  మండల ఉపాధ్యక్షుడు మరియు కార్యకర్తలు  గ్రామ ప్రజలు పాల్గొన్నారు.