సీసీరోడ్డు పనులకు భూమి పూజ చేసిన కాంగ్రెస్ నాయకులు

నవతెలంగాణ – జక్రాన్ పల్లి

జక్రాన్ పల్లి మండల కేంద్రంలో సీసీ రోడ్డు పనులకు భూమి పూజ చేయడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ మండల యువజన విభాగము అధ్యక్షుడు వినోద్ తెలిపారు .
సీసీరోడ్డు కొరకు ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుండి రూ.20 లక్షలు రూపాయలు మంజూరు అయిన సీసీ రోడ్డును  జన్క్ పల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు భూమి పూజ చేశారు. రూ.20 లక్షల రూపాయలు మంజూరు కావడానికి సహకరించిన ఎమ్మెల్యే రేకులపల్లి భూపతి రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కాట్పల్లి నర్సిరెడ్డి జక్మాన్ పల్లి మండల యువజన విభాగం అధ్యక్షుడు సొప్పరి వినోద్  మునిపల్లి మాజీ సర్పంచ్ చిన్న సాయి రెడ్డి  జిల్లా జనరల్ సెక్రెటరీ గన్న లక్ష్మి మైనార్టీ అధ్యక్షులు సైకిల్ టేక్స్ అక్బర్ ఖాన్ జైడి మల్లేష్ అప్పుడు రీక్కల సంజయ్  నియమత్ అలీ వెంకన్న, గ్రామ పెద్దమనుషులు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.