కమ్మర్ పల్లి మండల కేంద్రంలో కొనసాగుతున్న కుల గణన సర్వే జరుగుతున్న తీరును కాంగ్రెస్ పార్టీ నాయకులు సోమవారం పరిశీలించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి ఆధ్వర్యంలో గ్రామంలో పలు నివాస గృహాల్లో కొనసాగుతున్న సర్వేను సందర్శించారు. సర్వే జరుగుతున్న తీరును ఎన్యూమరేటర్లను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం నిజమైన అర్హులకు అభివృద్ధి సంక్షేమ ఫలాలను అందించే సదుద్దేశంతోనే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను చేపట్టిందని ఈ సందర్భంగా సుంకేటా రవి తెలిపారు. సర్వే పట్ల ప్రజలెవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిమ్మ రాజేంద్రప్రసాద్, ఊట్నూరి ప్రదీప్, పూజారి శేఖర్, అబ్దుల్ రఫీ, అవారి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.