గత నెల జనవరి 31న శిలాపాలకలు ఏర్పాటు చేసిన విషయంలో ఎంపీడీవో ఎంపీవో, పంచాయతీ కార్యదర్శి హాజరు కాలేదని, నాగేపల్లి గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవనం కట్టకుండా కట్టినట్టు తప్పుడు సమాచారం ఇచ్చి ప్రోటోకాల్ పాటించలేదని నాపై కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం జరిగిందని, రామగిరి మండలంలోని నాగేపల్లి సర్పంచ్ కొండవేన ఓదెలు యాదవ్ అన్నారు. అలగే నా యొక్క సొంత ఖర్చులతో పాఠశాల ఉపాధ్యాయులు కోరిక మేరకు జ్ఞాన సరస్వతి విగ్రహ ఏర్పాటు చేసినాను. తదనంతరం నేను గతంలో చేసిన పనులకు సంబంధించిన శిలాఫలకలాను గతంలోనే ఏర్పాటు చేసుకున్నాను, మే 5 సెప్టెంబర్ 2023 రోజున శిలాఫలకం అతికించడం జరిగిందనీ, తర్వాత నా యొక్క పదవి కాలం చివరి రోజున అయినటువంటి జనవరి 31. 2024 రోజున శిలాపలకాల దగ్గర గ్రీన్ క్లాత్ పెట్టుకొని నా పాలకవర్గం సభ్యులం మాత్రమే ఫోటో దిగడం జరిగిందిని. ఏ ప్రజాప్రతినిధులను ఆహ్వానించలేదనీ, ఎంపీడీవో ఎంపీవో లకు కూడా హాజరు కాలేదు అని అన్నారు. అదేవిధంగా నామీద వ్యక్తిగత కక్షలతో అభివృద్ధిని జీర్ణించుకోలేక అధికారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, నావల్ల ఏదైనా ఇబ్బంది జరిగితే నాపై చట్టపరమైన చర్య తీసుకోగలరనీ, నేను ఏ రకమైన తప్పు చేసినట్టు అనిపిస్తే నాపై చర్య తీసుకోవాలి కానీ ఇందులో అధికారులకు ఎలాంటి సంబంధం లేదని ఆయన అన్నారు.