డీఎస్పీని సన్మానించిన కాంగ్రేస్ నాయకులు

నవతెలంగాణ – జుక్కల్

ఇటివలే నూతనంగా పదవి బాద్యతలు చేపట్టిన  బాన్సువాడ డీఎస్పీ సత్యనారాయణ ను జుక్కల్ మండల కాంగ్రేస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ అస్పత్ వార్ వినోద్ కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంధర్భంగా డీఎస్పీ సత్యనారాయణ మాట్లాడుతు డివిజన్ పరిదిలో  ప్రదానంగా శాంతీభద్రతలకు ప్రాముఖ్యత నిస్తు చట్టవ్యతిరేక కర్యకలాపాలను అడ్డుకట్ట వేసి కఠిన చర్యలు ఉంటాయని, అక్రమ ఇసుక రవాణా , మత్తు పదార్థాల తరలింపు నియంత్రణ చేపడుతామని, ప్రజలు సమస్యలను నేరుగా వచ్చి పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదు చేయాలని తెలిపారు. కార్యక్రమం లో కాంగ్రేస్ నాయకులు తదితరులు పాల్గోన్నారు.