మంత్రి దుద్దిల్లను సన్మానించిన కాంగ్రెస్ నాయకులు 

నవతెలంగాణ-రామగిరి 
రామగిరి మండలం కాంగ్రెస్ నాయకులు ఉమ్మడి ముత్తారం మండలం మాజీ జెడ్పిటిసి మైదం భారతి వరప్రసాద్ ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన తెలంగాణ సాధారణ ఎన్నికల్లో మంథని నియోజకవర్గం నుండి అఖండ మెజార్టీతో  గెలిచి  ఐటి పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల మంత్రి పదవి పొందిన దుద్దిల శ్రీధర్ బాబును హైదరాబాద్ లో కలిసి శుభాకాంక్షలు తెలియజేసి పూల బొకే అందజేసి శాలువాతో  సన్మానించారు. ఆయన వెంట నాయకులు ఆదివారం పేట మాజీ సర్పంచ్ వేపచెట్టు రాజేశం,మాజీ ఉప సర్పంచ్ అట్టె తిరుపతిరెడ్డి, కన్నూరి నర్సింగరావు, చింతల శ్రీనివాస్ రెడ్డి, పొన్నం సత్యనారాయణ గౌడ్, అజయ్ రెడ్డి, తదితరులు ఉన్నారు.