నవతెలంగాణ – పెద్దకొడప్ గల్: పెద్దకొడప్ గల్ మండల కేంద్రంలో నూతనంగా ఎంపికైన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షునిగా మూడవసారి ఎన్నికైన సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాపైన ఎంతో నమ్మకంతో మూడవసారి మండల అధ్యక్షుని బాధ్యతలు నాకు అప్పచెప్పినందుకు రానున్న ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడి పార్లమెంట్ ఎన్నికలు కానీ స్థానిక ఎన్నికల్లో కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా కృషి పార్టీ కోసం పని చేసే కార్యకర్తలకు ఏ అవసరం వచ్చిన వారికి అందుబాటులో ఉంటానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సంతోష్ దేశాయ్, సాయి రెడ్డి, బసవరాజ్ దేశాయ్, కాంత రెడ్డి, విట్టల్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.