నవతెలంగాణ – అశ్వారావుపేట
మున్సిపాల్టీ కమీషనర్ గా విధుల్లో చేరిన కే.సుజాత కు మంగళవారం కార్యదర్శి శ్రీరామమూర్తితో సిబ్బంది పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. కాంగ్రెస్ నాయకులు మొగళ్ళపు చెన్నకేశవరావు, జ్యేష్ట సత్యనారాయణ చౌదరి, సత్యవరపు బాలగంగాధర్ లు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి, శాలువా తో సన్మానించారు. కమీషనర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన వారిలో కాంగ్రెస్ నాయకులు జూపల్లి ప్రమోద్, పుర ప్రముఖులు ఉన్నారు.