నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని గొల్లపేట ఇందిరమ్మ కాలనీలో జరుగుతున్న సిమెంట్ మురికి కాలువల నిర్మాణం పనులను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదివారం సందర్శించి పరిశీలించారు. ఇందిరమ్మ కాలనీలో కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జి ముత్యాల సునీల్ కుమార్ సహకారంతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో సిమెంటు మురికి కాలువలను నిర్మాణం పనులను చేపట్టారు. నిర్మాణం పూర్తయిన మురికి కాలువలను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు సందర్శించి పరిశీలించారు. మురికి కాలువలను నాణ్యతతో నిర్మించి, మంచిగా క్యూరింగ్ చేయాలని కాంట్రాక్టర్ కు సూచించారు.కాలనీలో మురికి కాలం నిర్మాణం చేపట్టడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కాలనీవాసులు కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జి ముత్యాల సునీల్ కుమార్, కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.