ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ నాయకులు

నవతెలంగాణ- వలిగొండ రూరల్ : నూతనంగా గెలుపొందిన భువనగిరి శాసన సభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి శనివారం పదవీ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భముగా వలిగొండ మండల కాంగ్రెస్ నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛము అందజేసి శాలువాలతో ఘనంగా సన్మానించారు . ఈ కార్యక్రమంలో ఎంపిపి నూతి రమేష్, సర్పంచ్ బోళ్ల లలిత శ్రీనివాస్, తుమ్మల యుగంధర్ రెడ్డి, పలుసం సతీష్, పల్లెర్ల సుధాకర్, కంకల కిష్టయ్య, ఎమ్మె లింగ స్వామీ, కాసుల వెంకన్న, కొండూరు సాయి తదితరులు పాల్గొన్నారు.