ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని డీసీసీ అధికార ప్రతినిధి, ఎంపీటీసీల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు గూడూరు శ్రీనివాస్ రెడ్డి, ఆమనగల్ మాజీ జడ్పీటీసీ సభ్యులు శ్రీపాతి శ్రీనివాస్ రెడ్డి తదితరులు మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పూల బోకేలు అందజేసి శాలువాలతో సన్మానించినట్టు వారు తెలిపారు. కల్వకుర్తి నియోజకవర్గం అభివృద్ధికి ప్రభుత్వ పరంగా సహకరించాలని ముఖ్యమంత్రిని కోరగా ఆయన సానుకూలంగా స్పందించినట్టు వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా స్థానికంగా నెలకొన్న పలు సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తెచ్చినట్టు వారు పేర్కొన్నారు.