కమ్మర్ పెల్లి పసుపు పరిశోధన కేంద్రం వద్ద ఏర్గట్లకు చెందిన కాంగ్రెస్ నాయకులు గురువారం తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కమీషన్ చైర్మన్ ఎం.కోదండ రెడ్డిని కలిసి ఘనంగా సన్మానించారు.అనంతరం తమ ప్రాంతంలో రైతాంగం ఎదుర్కొంటున్న పలు సమస్యలపై,వాటి పరిష్కారాల గురించి చర్చించినట్లు ఏర్గట్ల మండల కాంగ్రెస్ నాయకులు తెలిపారు.రైతాంగ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలని కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు సోమ దేవరెడ్డి,డీసీసీ ఉపాధ్యక్షులు శివన్నోళ్ళ శివకుమార్, కమ్మర్ పెల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ కొరిపెల్లి లింగారెడ్డి, నాయకులు ముస్కు మోహన్ రెడ్డి, గడ్డం జీవన్, బద్దం లింగారెడ్డి, దండెవోయిన సాయికుమార్, తదితరులు పాల్గొన్నారు.