మంత్రిని కలిసిన కాంగ్రెస్ నాయకులు 

Congress leaders met the ministerనవతెలంగాణ – గోవిందరావుపేట
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ని సోమవారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు స్థానిక కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పాలడుగు వెంకట కృష్ణ మంత్రిని కలిసిన సందర్భాన్ని మీడియాకు రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తో మండల పరిస్థితులను కొన్నింటిని దృష్టికి తీసుకురావడం జరిగిందని అన్నారు. మంత్రి సహృదయంతో స్పందించినరని,వెంకటకృష్ణ తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కణతల నాగేందర్ రావు, తుమ్మల శివ తదితర నాయకులు పాల్గొన్నారు.