జనజాతరకు తరలిన కాంగ్రెస్ నాయకులు

నవతెలంగాణ – నాగార్జునసాగర్
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి ఆదేశాను సారం కుందూరు జానారెడ్డి ఆధ్వర్యంలో కుందూరు జైవీర్, రఘువీర్ రెడ్డి సమక్షంలో సాగర్ నందికొండ నుంచి కాంగ్రెస్ నాయకులు రమావత్ మోహన్ నాయక్,చిన్ని,సాగర్ బాబు హైదరాబాదులో తక్కుగూడ లో జరిగే జనజాతర సభకు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా మోహన్ నాయక్ మాట్లాడుతూ హైదరాబాద్ లో  జనజాతర సభకు ఏ.ఐ.సి.సి జాతీయ నాయకురాలు సోనియా గాంధీ, కాబోయే భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఈ సభకు విచ్చేసి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేయనున్నారని అన్నారు.