మంత్రి సీతక్క పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటిన కాంగ్రెస్ నాయకులు

నవతెలంగాణ – తాడ్వాయి 
పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, స్త్రీ- శిశు సంక్షేమ శాఖ మంత్రి దనుసరి అనసూయ సీతక్క పుట్టినరోజు సందర్భంగా మంగళవారం బీరెల్లి లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మొక్కలు నాటి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనహృదయ నాయకురాలు, అలుపెరుగని పోరాట వనిత, ఆదివాసి ముద్దుబిడ్డ అరణ్యంలో అక్క వై, జనారంయంలో బిడ్డ వై ప్రజా సమస్యలు నీ సమస్యలుగా భావించి నాటి నుండి నేటి వరకు ఉదయాల్లో అధికంగా ఉన్న మన ములుగు శాసన సభ్యురాలు రాష్ట్ర మంత్రివర్యులు సీతక్కకు ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఇంకా ఎన్నెన్నో పదవులు పొందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో బీరెల్లి మాజీ సర్పంచ్ బెజ్జూరి శ్రీనివాస్, గ్రామ కమిటీ అధ్యక్షులు మొక్కటి కోటి, ఎంపీటీసీ ఇరుసోడ్ల భవాని నారాయణ, సీనియర్ నాయకులు దాయ వెంకటేశ్వర్లు(కోడి), అల్లెం సాంబశివరావు, కాలేశ్వరం వీరాచారి, జాజ శివ, వంగరి సదానందం, సురేష్, వంగరి రమేష్, బాసాని అనిల్, గోసంగి స్వామి, తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.