కాంగ్రెస్ నాయకులు అసత్య ప్రచారం మానుకోవాలి   

నవతెలంగాణ – వీర్నపల్లి 

కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆసత్య ప్రచారం మానుకోవాలని బీజేపీ మండల అధ్యక్షులు దేవేందర్ రెడ్డి అన్నారు. వీర్నపల్లి మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు గునుకుల దేవేందర్ రెడ్డి అధ్వర్యంలో బుధవారం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ చిత్ర పటానికి పాలభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మంత్రి పొన్నం ప్రభాకర్ ను గూర్చి అసత్యంగా మాటలు మాట్లాడకుండానే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆసత్య ప్రచారం చేస్తున్నారు. అసత్య ప్రచారం మానుకోవాలన్నారు. కరీంనగర్ కు ఎంపీ బండి సంజయ్ కుమార్ కేంద్రం ప్రభుత్వం నుండి రూ.12వేల కోట్ల రూపాయలు నిధులు కేటాయించినందుకు పాలాభిషేకం చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు బొడ మల్లేశం , బీజేపీ ఎస్టీ మోర్చ మండల అధ్యక్షులు మాలోతు ప్రకాష్,నాయకులు ప్రవీణ్ , సంతోష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.