కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన పూర్తిగా గాడి తప్పిందని, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టకుండా ప్రజాపాలన దరఖాస్తులను పరిష్కరించకుండా, ఆరు గ్యారెంటీ స్కీంలను నెరవేర్చకుండా విమర్శించే నాయకులను ప్రతి విమర్శలు చేయటం కాంగ్రెస్ నాయకులకు తగదని బీఆర్ఎస్ నాయకులు శక్కరి కోండ కృష్ణ, నల్లవెల్లి సాయిలు, పద్మరావు, ఒడ్డెం నర్సయ్య, దాసరి లక్ష్మీనర్సయ్య అన్నారు. ఆదివారం డిచ్ పల్లి మండల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు తెలంగాన ఉద్యమంలో మాజీ ఎమ్మెల్సీ వీ జీ గౌడ్, ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ మోహన్ ఎంతో పని చేశారని, కాంగ్రెస్ నాయకులే తెలంగాణ ఉద్యమంలో పని చేయలేదని, గడిచిన యేడాది కాలంలో కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన హామీలను నిలబెట్టకుండా విమర్శలు చేయడం అర్థరహితమన్నారు. సిఎం రేవంత్ రెడ్డి మహిళలలకు 4 వేల పెన్షన్ ఇస్తానని చెప్పి ఇంతవరకు నెరవేర్చలేదని, రైతు రుణమాఫీ కూడా పూర్తిస్థాయిలో ఎక్కడ జరగలేదని, తల్లి తెలంగాణ విగ్రహం పెట్టిన చోట సచివాలయం వద్ద రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం అర్ధరహితమని విమర్శించారు. ఆరు గ్యారెంటీల అమలు ఇంతవరకు నెరవేర్చలేదని, అమృతాపూర్ గంగాధర్ స్థాయిని మరిచి విమర్శలు చేస్తే సహించేది లేదన్నారు. కాంగ్రెస్ నాయకులు గ్రూప్ రాజకీయాలు పెట్టుకుని విమర్శలు చేస్తే ఊరుకోబోమన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చి తెలంగాణ ఉద్యమంలో 1200 మంది విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకోవడానికి కారణం కాంగ్రెస్ నాయకులా కాదా అని వారు ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. యేడాది పాలనలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు పూర్తిగా ప్రభుత్వ పాలనపై విస్మయం చెందుతున్నారన్నారు. రాబోవు రోజుల్లో మాజీ ఎమ్మెల్సీ వీజీగౌడ్, మాజీ జడ్పీటీసీ జగన్ మోహన్ ను విమర్శిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. రేవంత్రెడ్డి దగా కోరు నాయకుడన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర సమితి మెజార్టీ స్థానాలు గెలుపొందుతుందని, కాంగ్రెస్కు చెంపపెట్టు తప్పదన్నారు. సమావేశంలో పార్టీ ప్రతినిధులు మాజీ కో ఆప్షన్ సబ్యులు షేక్ నయీమ్, సూదం నాయక్, కుమ్మరి గంగాధర్, తోపాటు తదితరులు పాల్గొన్నారు.