మృతుల చిత్రపటాలకు కాంగ్రెస్ నాయకుల నివాళులు

Malharనవతెలంగాణ – మల్హర్ రావు.
మండలంలోని నాచారం గ్రామానికి చెందిన కలువల సారయ్య దిశకర్మ,బండారి రమణ కుమార్ 12వ వర్ధంతి వేడుకలు సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మృతుల చిత్రపటాలకు పూలువేసి నివాళులర్పించారు. అధైర్య పడొవద్దు ప్రభుత్వం అండగా ఉంటుందని బాధిత కుటుంబాలను ఓదార్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాచారం గ్రామ శాఖ అధ్యక్షులు కన్నూరి రవి, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు మంత్రి రాజసమ్మయ్య,ప్రధాన కార్యదర్శి మావురపు వెంకన్న ,మాజీ వార్డ్ నెంబర్ గాజు శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారి చిన్న ముత్తయ్య, బూత్ కమిటీ అధ్యక్షులు కన్నూరి అశోక్ ,యూత్ నాయకులు భానోత్ నాగేంద్రబాబు, ఉప్పుల నరేష్ ,బండారి క్రాంతి పాల్గొన్నారు