
మండలంలోని గుడేప్పహడ్ గ్రామానికి చెందిన గ్రామ పార్టీ అధ్యక్షులు కంది కోండ రఘుపతి తండ్రి సాంబయ్య ఇటివలే మృతి చెందగా విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కమలాపురం రమేష్, మాజీ ఎంపిటిసి పరికరాల వాసు, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం మృతుని చిత్రపటానికి పూలమాల లేసి నివాళులర్పించి మృతుడి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పరామర్శించిన వారిలో మండల ఉపాధ్యక్షులు చిదిరాల శ్రీనివాస్ రెడ్డి, పిఎ సీఎస్ చైర్మన్ జనగాం ప్రభాకర్ గౌడ్, మాజీ సర్పంచ్ బూర రాజేందర్, బోటిక బిక్షపతి ,టౌన్ పార్టీ కార్యదర్శి అలువాల రవి, ఓరుగంటి కరుణాకర్ రెడ్డి ,పోరెడ్డి బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.