నవతెలంగాణ- రామారెడ్డి
మండలంలోని మోషన్ పూర్ గ్రామానికి చెందిన పొన్నాల సంజీవరెడ్డి ఇటీవల పొలం పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి గాయపడగా, ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. ఆయన ను మోషన్ పూర్ లో ఇంటి వద్ద మాజీ జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గీ రెడ్డి మహేందర్ రెడ్డి పరామర్శించి, మనోధైర్యాన్ని అందించారు. కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి, లచ్చిరెడ్డి, మంగలి దత్తాత్రి తదితరులు ఉన్నారు.