మండల కేంద్రంలోని రెంజల్ రైతు వేదికలో శనివారం సాయంత్రం రైతు పండగ, మన పండుగ, తెలంగాణ పండగ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ను రెంజల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తిలకించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మొబిన్ ఖాన్, జావీద్ ఉద్దీన్, ధనుంజయ్, ఎమ్మెల్ రాజు, మండల వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, ఏ ఈ ఓ లు ప్రసాద్, సాకేత్ సాయిలు, అజయ్ కుమార్, గోపి కృష్ణ, గంగాసాగర్, రైతులు తదితరులు పాల్గొన్నారు.