నవ తెలంగాణ-జక్రాన్ పల్లి: జక్రాన్ పల్లి మండల్ బ్రాహ్మణపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలను ఇంటింటికి తిరిగి ప్రజలకు వివరించడం జరిగిందని మండల యువజన విభాగము అధ్యక్షుడు వినోద్ తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ రాబోయే ఎలక్షన్లలో చేతి గుర్తుకు ఓటేసి డాక్టర్ భూపతి రెడ్డి ని గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారెంటీలలో రైతులకు గిట్టుబాటు ధర, 200 యూనిట్లు కరెంటు, చదువుకున్న మహిళలకు ఎలక్ట్రికల్ స్కూటీ ఫ్రీ, నిరుద్యోగ భృతి 3016 రూపాయలు, గృహలక్ష్మి షాది ముబారక్ ఇటువంటి మరెన్నో పథకాలను గ్రామస్తులకు వివరించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు చిన్నరెడ్డి, ఉపాధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ , యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సొప్పరీ వినోద్, బట్టు శ్రీనివాస్, ముత్తునూరు గంగాధర్. (అబస్) మధరి ధనియాల్, గోడ సాగర్, బట్టు రణవీర్, గోడ అరుణ్, గోడ సారిన్ బెతుర్, సుంకరి సుధాకర్, జిల్లా జనరల్ సెక్రెటరీ గన్న లక్ష్మణ్, మండల ప్రధాన కార్యదర్శి వసంతరావు, మునరాబాద్ బాలయ్య, మైనార్టీ అధ్యక్షులు సైకిల్ టెక్స్ అక్బర్, రైమత్ అలీ, నియమత్ అలీ, మండల ఉపాధ్యక్షులు యూత్ కేసుపల్లి ప్రణయ్, ఎస్సీ సెల్ అధ్యక్షులు కనక రవి, తాటిపల్లి నర్సారెడ్డి, కాటిపల్లి తెల్లన్న, జై గంగారం, బెంజిమెన్ సాయిలు, డేవిడ్, మహమ్మద్ హైమత్, మునిపల్లి రాజేశ్వర్, బీసీ సెల్ అధ్యక్షులు వెంకటేష్, బ్రాహ్మణపల్లి గ్రామ మహిళలు చాలా పెద్ద ఎత్తున గడపగడప ప్రోగ్రాం లో కాంగ్రెస్ సీనియర్ కార్యకర్తలు యువజన కార్యకర్తలు పాల్గొన్నారు.