నవతెలంగాణ – చండూరు
భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆదివారం నామినేషన్ వేస్తున్న సందర్భంగా చండూరు కాంగ్రెస్ మండల అధ్యక్షులు కురిమి ఓంకారం, పట్టణ అధ్యక్షులు అనంత చంద్రశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో మున్సిపల్ పట్టణంలో ర్యాలీ నిర్వహించి, కాంగ్రెస్ జెండా ఊపి భువనగిరికి బయలుదేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల ప్రజల పక్షాన పార్లమెంట్లో మాట్లాడేది దమ్మున్న నాయకుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. అలాంటి వ్యక్తిని పార్లమెంటు పంపితే ప్రజా సమస్యలపై నిలదీస్తారని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి విస్తుందని ఇది ఏమైనాఈ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో కలిమికుండా జనార్ధన్, గండూరి జనార్ధన్, నల్లగంటి మల్లేష్, సంకోజ్ బ్రహ్మం, కల్లెట్ల మారయ్య ,ఇరిగి వెంకటేశం, పాండు, రావిరాల రాజు తదితరులు పాల్గొన్నారు.