నవతెలంగాణ-శంకర్‌పల్లి
బీఆర్‌ఎస్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి గాజుల గూడ గ్రామంలోని కాంగ్రెస్ నాయకులు ఐదుగురు, గ్రామ సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షులు రమేష్ ఆధ్వర్యంలో గురువారం బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్య మంత్రి కేసీఆర్, చేవెళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్య చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి కాంగ్రెస్ నాయకులు వడ్డే రవి, తేరుపల్లి లక్ష్మయ్య, ఎదురుగూడెం సురేందర్, సారా నరసింహులు, ఎండీ అబ్దుల్ పార్టీల పార్టీలో చేరారు. అనంతరం వీరందరూ కలిసి ఎమ్మెల్యే కాలే యాదయ్య దగ్గరికి వెళ్లగా ఆయన పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిం చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, జడ్పీటీసీ గోవిందమ్మ గోపాల్‌రెడ్డి, సొసైటీ చైర్మెన్ శశిధర్‌రెడ్డి, ఉపసర్పంచ్ హుస్సేన్, కో-ఆప్షన్ సభ్యులు నయూమ్, మాజీ ఎంపీటీసీ అనంతరెడ్డి, పెద్దోళ్ల వెంకటరెడ్డి, షేక్ తాజుద్దీన్ ఉన్నారు.