
రాష్ట్ర కో ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డిని మండలంలోని ఉప్లూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు కలిశారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి ఆధ్వర్యంలో ఉప్లూర్ కాంగ్రెస్ నాయకులు మర్యాద పూర్వకంగా ఆయనను కలిశారు. ఈ మేరకు ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని స్వగృహంలో మానాల మోహన్ రెడ్డిని కలిసిన నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మోహన్ రెడ్డిని శాలువాతో సత్కరించారు. రాష్ట్ర కో ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డిని కలిసిన వారిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతకుంట శ్రీనివాస్, అవారి శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.