
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా ఎంపికైన అంతి రెడ్డి రాజిరెడ్డి నీ సోమవారం రెంజల్ మండల యువజన కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు కార్తీక్ యాదవ్, మండల ప్రధాన కార్యదర్శి గైని కిరణ్ లు మాట్లాడుతూ.. ప్రతి మండలంలో గ్రంథాలయాలను ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు చేయూతనివ్వాలని విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియా కన్వీనర్ లోక కృష్ణ, యువజన కాంగ్రెస్ నాయకులు మధు కృష్ణ, శ్రీకాంత్, గైని శివకుమార్, సురేష్, గౌతమ్, తదితరులు పాల్గొన్నారు.