నవతెలంగాణ – వీర్నపల్లి
వీర్నపల్లి మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు భూత శ్రీనివాస్ అధ్వర్యంలో నాయకులు వేములవాడ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ను మంగళ వారం కలిసి శాలువాతో సత్కరించి మండలంలో నిర్మాణములో ఉన్న ప్రభుత్వ ఇండ్ల బిల్లులు చెల్లింపు విషయం, వెంకట్రాయుని చెరువులో భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం, 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి మంజూరి చేయాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో వీర్నపల్లి మాజీ సర్పంచ్ పాటి దినకర్, నాయకులు సంతోష్ నాయక్, శ్రీనివాస్, రాజు పాల్గొన్నారు.