– మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
– జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్
నవతెలంగాణ – రామగిరి: కాంగ్రేస్ నేతలు తమ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై దాడులకు పూనుకుంటే సహించేది లేదని మాజీ మంత్రి పెద్దపల్లి బీ ఆర్ ఎస్ పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, జడ్పి చైర్మన్ పుట్ట మధూకర్ హెచ్చరించారు. గురువారం మండలం లోని బేగంపేట తాజా మాజీ సర్పంచ్ బుర్ర పద్మ భర్త బీఆర్ఎస్ నాయకుడు బుర్ర శంకర్ గౌడ్ పై కొందరు కాంగ్రెస్ నేతలు దాడి చేయగా ఆయన నివాసనికి వెళ్లి వారు పరామర్శించారు. దాడి వివరాలు తో పాటు ఆరోగ్య పరిస్థితిపై అడిగి తెల్సుకున్నారు. మంథనిలో మళ్ళీ అరాచకాలు మొదలైనవని ఇక్కడ ఉన్న మంత్రి శ్రీధర్ బాబు 70 ఎంఎం సినిమా చూపిస్తానని రెచ్చగొట్టే వాక్యాలు చేస్తుండడం మూలంగానే తమ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై నాయకులపై దాడులకు ఆజ్యం పోయడంతోనే బేగంపేట సర్పంచ్ భర్త బుర్ర శంకర్ గౌడ్ పై ఇక్కడ ఆ పార్టీ కి చెందిన అరాచక వ్యాధులా దాడికి కారణమన్నారు.
దాడి జరిగిందని పోలీస్ లకు ఫిర్యాదు చేసిన పట్టింపు కరువైందాన్నారు. బాధిడు పిఎస్ లో ఫిర్యాదు చేస్తే పిటిషన్ లో కొన్ని వాక్యాలు తొలిగించాలని తాము చెప్పినట్లు పిటిషన్ రాయాలని పోలీస్ అధికారులు హుకుం చేయడం వెనుక కూడ సదరు మంత్రి ఆదేశాలు ఉన్నట్లు ఆయన ఆరోపించారు. పోలీసులు పరదర్శకంగా వ్యవరించి భాదితులకు చట్ట పరంగా న్యాయం చేయాలన్నారు.ఆయన వెంట బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శెంకేషి రవీందర్, ఏఎంసీ మాజీ చైర్మన్ పూదరి సత్యనారాయణ గౌడ్,నాయకులు మేదరవేణి కుమార్ యాదవ్, కాపురబోయిన భాస్కర్, అసం తిరుపతి, దామేరా శ్రీనివాస్, రాచకొండ లక్ష్మణ్, మారగోని కుమారస్వామి ఉన్నారు.