
కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా గా సీనియర్ న్యాయవాది కల్లేపల్లి లక్ష్మయ్య, వైస్ చైర్మన్లుగా వడ్లూరి కృష్ణ , ప్రదీప్ కుమార్ రాజు నియామకం పట్ల లీగల్ సెల్ న్యాయవాదులు బార్ హాల్ లో మిఠాయి లు పంచుతూ సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షుడు కల్లేపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ తన మీద నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన టిపిసిసి లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్, స్టేట్ జాయింట్ కన్వీనర్ భూక్య రజనీష్, సహకరించిన మంత్రి పొన్నం ప్రభాకర్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది రూపిరెడ్డి దేవేందర్ రెడ్డి ,కన్వీనర్లు కొత్తకొండ శంకర్, లింగంపల్లి శ్రీకాంత్, ఎండి నవాజ్, జాయింట్ కన్వీనర్లు తుమ్మ ప్రభాకర్, రాయికంటి కుమార్, ఐతు సృజన్, బొడ్డు రాజు, ముఖ్య సలహాదారులు సింగిరెడ్డి లక్ష్మారెడ్డి, లుక్కా రాజేశం, ఎస్ కిషన్ లు పాల్గొన్నారు.