పార్టీ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని రాజీవ్ ట్రస్ట్ కార్యదర్శి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎంఏ ఖయ్యూం శనివారం అన్నారు. చౌటుప్పల్ మండలం నేలపట్ల తాళ్లసింగారం గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు రాజీవ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీరాముల లోకేశ్వరి బత్తుల నరసింహ లకు రూ.15 వేల చొప్పున నగదు ఆర్థిక సాయం అందజేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని తెలియజేశారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల మాజీ అధ్యక్షులు మాజీ సర్పంచ్ గుండు మల్లయ్య గౌడ్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు సుర్వి నరసింహ గౌడ్, రాజీవ్ ట్రస్ట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నల్ల నరసింహ, గ్రామ శాఖ అధ్యక్షులు పాలమాకుల నరసింహ, దొనకొండ కృష్ణ, మాజీ ఉపసర్పంచులు పాలమాకుల యాదయ్య, తడక వెంకటేశం, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొడెం రాములు, మహేష్ గౌడ్, చౌట లింగం గౌడ్,గుర్రం శ్రీనివాస్,దోనకొండ బాలయ్య, బొంగు లచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.