పిసిసి అధ్యక్షుడిని కలిసిన కాంగ్రెస్ మండల నాయకులు

నవతెలంగాణ- రామారెడ్డి
 నూతన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ను బుధవారం మండల నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి, పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ కోసం ప్రతి ఒక్కరు పనిచేయాలని, ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయాలని మహేష్ కుమార్ గౌడ్ సూచించినట్లు తెలిపారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక కార్యకర్తకు న్యాయం జరిగేలా చూడాలని నాయకులు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను కోరగా, కష్ట పడిన వారికి తప్పకుండా న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు గీరెడ్డి మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు నారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, రెడ్డి నాయక్, రఘోత్తమ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.