ఏఐసీసీ లీగల్ సెల్ చైర్మన్ అభిషేక్‌ ను కలిసిన కాంగ్రెస్ సభ్యులు 

నవతెలంగాణ- హైదరాబాద్ :  ఏఐసీసీ  లీగల్ సెల్ చైర్మన్  అభిషేక్  సింఘ్వీ ను తెలంగాణ కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్, స్టేట్ లీగల్ సెల్ కన్వీనర్ ఖాజా అహ్మద్ ఆదివారం కలిశారు. తెలంగాణలో ఇటీవల ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి తమ పార్టీ అభ్యర్థిగా ఆయనను  కాంగ్రెస్‌ ప్రకటించడంతో పాటు, ఏఐసీసీ  లీగల్ సెల్ చైర్మన్ హోదా లో మొదటి సారి హైదరాబాద్ లోని కాంగ్రెస్  కార్యాలయానికి రాగా పార్లమెంటు సభ్యుడు  మల్లు రవి, తెలంగాణ కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్, స్టేట్ లీగల్ సెల్ కన్వీనర్ ఖాజా అహ్మద్, లీగల్ సెల్ సభ్యులు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుప్రీమ్ కోర్ట్  న్యాయవాది, కాంగ్రెస్ పార్టీ నాయకుడు అభిషేక్  సింఘ్వీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ క్షేత్ర స్థాయిలో మరింత బలోపేతం అవుతుందని ఆకాంక్షించారు. ఇప్పటికే  పార్టీ కోసం పాటుపడే ప్రతి కార్యకర్త న్యాయపరంగా సవాళ్ళను ఎదుర్కోవడానికి కార్యాచరణ సిద్ధం అయ్యిందన్నారు. వారికి అన్నివిధాలుగా అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాది పొన్నం మహేశ్ గౌడ్, మోమిన్ రోషన్ బేగ్, నిస్సార్ అహ్మద్, అర్హాన్ అహ్మద్, తిరుపతి వర్మ, మొహమ్మద్ రహ్మత్ అలీ, బాసిత్ ఖాన్, మెహమూద్ ఉర్ రెహమాన్ పాల్గొన్నారు.