నిజాంబాద్ ఎంపీ సీటు కాంగ్రెస్ దే: ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

నవతెలంగాణ –  రెంజల్
రాబోవు పార్లమెంటు ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే దిశగా నాయకులు కార్యకర్తలు పని చేయాలని బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. మండలంలోని కందకుర్తి గ్రామంలో ఆయన స్థానిక నాయకులతో మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు నియోజకవర్గం అభివృద్ధితోపాటు ప్రజల సహాయ సహకారాలను తీసుకోవాలన్నారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలకు 10 లక్షల రూపాయల చొప్పున ఖర్చు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కందకుర్తి పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉందని స్థానిక నాయకులు ఆయన దృష్టికి తీసుకురాగా, వచ్చే విద్యా సంవత్సరం నుంచి పూర్తిస్థాయిలో ఉపాధ్యాయుల నియామకం చేపడతామని ఆయన వారికి హామీ ఇచ్చారు. సిసి రోడ్లపై కేజీ విల్ ను నడిపిస్తే కేసులు నమోదు చేయించేలా నాయకులు ముందు ఉండాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయా గ్రామాలలో గ్రావెల్ రోడ్లకు నిధులు మంజూరు చేస్తామని ఆయన అన్నారు. గ్రామాలలో సమస్యలు ఉత్పన్నమైతే స్థానిక అధికారులతో వాటిని పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మొబిన్ ఖాన్, స్థానిక నాయకులు గయాస్ ఉద్దీన్, హజ్మత్, పుర్ఖాన్, సిరాజ్, మతిన్, యాదవరావు, శంకర్, సాయిలు, సురేష్, సాజిద్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు అబ్దుల్ కరీం, గంగాధర్, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు….