– డీసీసీబీ చైర్మన్ గొంగడి మహేందర్ రెడ్డి
నవతెలంగాణ- బొమ్మలరామారం : కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే రాష్ట్రాన్ని అమ్మేస్తారని, కుట్రల కాంగ్రెస్ కు ఓటుతో బుద్ధి చెప్పాలని డీసీసీబీ చైర్మన్ గొంగడి మహేందర్ రెడ్డి తెలిపారు. దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో ఆ పార్టీ నాయకులు ప్రజా ధనాన్ని దాచుకోవడం, దోచుకోవడమే చూస్తున్నారని.గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలోని మర్యాల, గోవింద్ తండా, తిమ్మాపూర్, సోలిపేట, జలాల్పూర్, బొమ్మలరామారం లో బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల ప్రజలు డీసీసీబీ చైర్మన్ గొంగడి మహేందర్ రెడ్డికి డప్పు చప్పుళ్ళు మంగళహారతులతో, గాజా మాలతో పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు. గిరిజన తండాలో, గ్రామాలలో, మహిళలు పెద్ద ఎత్తున కార్యక్రమానికి హాజరయ్యారు.గ్రామ సమస్యలను మహేందర్ రెడ్డి కి దృష్టికి తీసుకురాగ వారు సానుకూలంగా స్పందించారు.అనంతరం వారు మాట్లాడుతూ… నియోజకవర్గ అభివృద్ధి కోసం పని చేస్తానని ప్రజలు నిండు మనసుతో మూడవసారి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. చేసేదే చెప్తానని మాయమాటలు చెప్పి మాయమయ్యే వ్యక్తులకు ఓటు వేసి తరువాత పరేషాన్ కావద్దనీ సూచించారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేశారన్నారు. తండాలను గ్రామపంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. నీళ్లు లేక బీటలు వారిన నేలలకు మూడు పంటలకు కాలేశ్వరం ద్వారా సాగునీరు అందించి సస్యశ్యామలం చేశారన్నారు. అదేవిధంగా దళితులు ఆర్థికంగా ఎదగాలని ఆలోచనతో సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం ఏర్పాటు చేస్తే, ఆ పథకాన్ని మండలానికి మునీరాబాద్ కి తీసుకొచ్చి ఈ ప్రాంతం వారికి దళిత బంధు అందించడం జరిగిందన్నారు. మండలంలో ప్రతి గ్రామానికి దళిత బంధు అందజేస్తామని. అదేవిధంగా పేదల ఇంట్లో ఆడబిడ్డ పెళ్లి తల్లిదండ్రులకు భారం కాకూడదని ఉద్దేశంతో రూ.1.16 లక్షలు అందిస్తున్న ఏక రాష్ట్రం తెలంగాణ అన్నారు.200 రూ.పింఛన్ ను 2000రూ.పెంచినట్లు తెలిపారు. మరోసారి ఆశీర్వదించి గెలిపిస్తే 2000 పింఛన్ ను 5000రూ లకు, దివ్యాంగులకు 6000 రూ. కేసీఆర్ బీమా, సన్నబియ్యం, సౌభాగ్య లక్ష్మి కింద నెలకు 3000రూ.400 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇల్లు కట్టిస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మళ్లీ కరెంట్ కష్టాలు తప్పవని, మళ్లీ మూడు గంటల కరెంటే ఇస్తుందని తెలిపారు.సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని, ప్రతి ఒక్కరూ సంక్షేమ పథకాలను గుర్తుపెట్టుకుని, జరిగిన అభివృద్ధిని చూసి ఆలోచించి రాబోయే అసెంబ్లీ ఎన్నికల నవంబర్ 30వ తేదీన కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారితో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీ ఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కల్లుర్తి రామచంద్రారెడ్డి, హరి శంకర్ గౌడ్, ఎంపీపీ సుధీర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్, సింగిల్ విండో చైర్మన్ బాల్ నరసయ్య, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మన్నె శ్రీధర్, రామిడి రామ్ రెడ్డి, పలు గ్రామాల సర్పంచులు, నాయకులు, యువత పాల్గొన్నారు.