– ఆరేండ్లపాటు పార్టీ నుంచి బహిష్కరణ: టీపీసీసీ క్రమశిక్షణ విభాగం చైర్మెన్ చిన్నారెడ్డి ప్రకటన
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి బక్క జడ్సన్‌పై కాంగ్రెస్ వేటు వేసింది. ఆరేండ్లపాటు ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించింది. టీపీసీసీ క్రమశిక్షణ విభాగం చైర్మెన్ జి చిన్నారెడ్డి ఈమేరకు మంగళవారం ఒక ప్రకటనవిడుదల చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందు వల్ల నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. ఇటీవల ఆయనకు నోటీసు జారీ చేశామనీ, ఆ నోటీసుకు ఆయన చెప్పిన సమాధానాలపై క్రమశిక్షణ కమిటీ సంతృప్తి చెందలేదని పేర్కొన్నారు. అందుకే ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించామని తెలిపారు.