గజ్వేల్లో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ని ముట్టడించిన కాంగ్రెస్ పార్టీ

దసరా పండుగ లోపు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంచ్చాలాని డిమాండ్ లేనియెడల స్వయంగా కేసీఆర్ వుండే నివాసానికే లబ్ధిదారులతో వస్తామని– పండుగలోపు చెక్కులు పంపిణీ చేయాలి.
నవతెలంగాణ -గజ్వేల్
దసరా పండుగ లోపు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంచ్చాలాని డిమాండ్ లేనియెడల స్వయంగా కేసీఆర్ వుండే నివాసానికే లబ్ధిదారులతో వస్తామని గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఒంటేరు నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, మున్సిపల్ మాజీ చైర్మన్ గాడి పల్లి భాస్కర్ అన్నారు. సోమవారం గజ్వేల్ ల ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసును వారు ముట్టడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  శాసనసభ ఎన్నికలు అయినప్పటి నుండి గజ్వేల్ శాసనసభ్యులు ప్రజలకు అందుబాటులో ఉండకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు గురి అవుతున్నారని వారు పేర్కొన్నారు. ముఖ్యంగా కళ్యాణ లక్ష్మి చెక్కులను షాది ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు ఇవ్వలేకపోతున్నారని తక్షణమే గజ్వేల్ శాసనసభ్యులు స్పందించి దసరాల్లోపు చెక్కులను పంచాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నామన్నారు. లేనిపక్షంలో మరో కార్యచరణకు సిద్ధం అవుతామని పేర్కొన్నారు. అలాగే నిన్న గజ్వేల్ లో ఓ బిఆర్ఎస్ నాయకుడు తెలివి తక్కువ అజ్ఞానంతో మాట్లాడుతున్నారని వారు విమర్శించారు. తెలంగాణలో కళ్యాణ లక్ష్మి చెక్కులు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పంచలేదని అబద్ధాలు మాట్లాడుతున్నట్లు వారు పేర్కొన్నారు. బీ ఆర్ఎస్ శాసనసభ్యులను అడిగి మాట్లాడు పక్కకే ఉన్న దుబ్బాక, జనగామ నియోజకవర్గ శాసనసభ్యులతో మాట్లాడి చెక్కులు వచ్చినయా లేదా తెలుసుకొని మాట్లాడాలని వారు కోరారు. పక్కకు ఉన్న దుబ్బాక జనగామ నియోజకవర్గం జిల్లా ఇంచార్జ్ మంత్రి సురేఖ శాసనసభ్యులతో కలిసి పంచినట్లు వారు గుర్తు చేశారు.  అలాగే సిద్దిపేటలో కూడా సిద్దిపేట శాసన సభ్యులు పంపిణీ చేసినట్లు వారు అన్నారు.. ఇవన్నీ తెలుసుకోకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న ఆ నాయకునికి ఖబర్దార్ అని చెప్తున్నామన్నారు. మరోసారి చిల్లర మాటలు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సహించారని గజ్వేల్ లో నిన్ను తిరగనివ్వబోరని హెచ్చరిస్తున్నామన్నారు.
కేసీఆర్ తో మాట్లాడే దమ్ము ధైర్యం ఉంటే తక్షణమే కళ్యాణ లక్ష్మి చెక్కులను పంచి అలాగే గజ్వేల్ లో మిగిలిపోయిన పనులు బస్టాండ్ గాని, రింగ్ రోడ్డు పనులు, స్థానిక సమస్యలపై పరిష్కరించాలని కోరుతున్నామన్నారు. ఎందుకంటే గజ్వేల్ లో మున్సిపల్ చైర్మన్ తో పాటు ఎంపీపీలు, జడ్పిటిసిలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు బిఆర్ఎస్ నాయకులే ఉన్నారని వారు అన్నారు. ప్రజా సమస్యల పరిష్కరించడంలో వైఫల్యం చెందితే కెసిఆర్ తో పటు నాయకులతోటి రాజీనామా చేయించి పక్కకు తప్పుకోవాలి అంతేగాని కాంగ్రెస్ పార్టీపై నిందలు వేస్తే సహించబోమన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ పట్టణ ప్రధాన కార్యదర్శి నక్క రాములు గౌడ్, నాయకులు వెంకట నరసింహారెడ్డి, వర్గల్ మోహన్, శ్రీనివాస్ రెడ్డి, సుఖేందర్ రెడ్డి, మతిన్, కరుణాకర్ రెడ్డి, వహీద్, బోస్, రాజు, అజార్, రాజశేఖర్ రెడ్డి, బంగారు రెడ్డి, శివుడు శివారెడ్డి, నక్క రేగొండ, శ్రీనివాస్ రెడ్డి, శీను, జహీర్, రమేష్ గౌడ్, ఇక్బాల్, బాలు ,డబ్బు గణేష్ తదితరులు పాల్గొన్నారు