పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేయాలి..

– రాజీనామా పత్రంతో హరీష్ రావు సిద్ధంగా ఉండాలి..
– ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్..
నవతెలంగాణ – వేములవాడ రూరల్
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయానికి ప్రతి  ఒక్కరూ కృషి చేయాలి ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని ఇస్లాం నగర్ లో గురువారం పర్యటించారు.ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఇస్లాం నగర్ ప్రజలు చెప్పిన సమస్యలను పూర్తిగా విన్నానని త్వరలోనే  వాటినీ పరిష్కరించుకుందాం అన్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేంద్ర రావు ను గెలిపించాలని పిలుపునిచ్చారు.ఈ దేశంలో గత పది సంవత్సరాలుగా పనిచేస్తున్న భాజపా వ్యతిరేక విధానాలు ప్రజలందరూ గమనించాలన్నారు.. రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలను తెచ్చారని, నేతన్నలకు జీఎస్టీ విధించారని, దేశాన్ని మతాల పేరిట, ప్రాంతాల పేరిట బిజెపి విడదీయాలని చూస్తుందన్నారు.బీసీ,ఎస్టీ, ఎస్సీ రైతు వర్గాలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్న బిజెపి నిర్ణయాలను వ్యతిరేకిస్తూ, బిజెపి ప్రభుత్వం దేశాన్ని విచ్చినం చేయాలని చూస్తుందని దానికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, భారత్ జూడో పాదయాత్ర చేశారని ఉన్నారు. రెండో విడతలో మణిపూర్ నుంచి వరకు పాదయాత్ర చేశారని , ఆ పాదయాత్రలో రాహుల్ గాంధీ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల సమస్యలను విని వాటినీ పరిష్కరించే దిశగా పాంచ్ న్యాయ్ అమలు చేస్తూ దేశాన్ని ముందుకు తీసుకుపోవడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. దేశంలో మొదటి విడత ఎన్నికలు పూర్తయిన తర్వాత ప్రజానాడి భాజపాకి వ్యతిరేకంగా ఉందని తెలిసి నరేంద్ర మోడీలో ఒక భయం పట్టుకుందన్నారు.దీంతో ముస్లింలకి ఆస్తి పంచుతారని అనడం, తాళిబొట్లు లాక్కుంటారని వారనే మాటలు చూస్తే బీజేపీకి ఓడిపోతామని భయం పట్టుకుందన్నారు.. కేవలం భాగోద్వేగాన్ని రెచ్చగొట్టి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని అన్నారు.మన లౌకిక దేశంలో మనం అన్ని మతాలను గౌరవించుకోవాలని చట్టాలు తయారుచేసిన రాజ్యాంగంపై ప్రమాణం చేసిన మోడీ ఎన్నికల్లో ఓడిపోతున్నామని ప్రజల్లో భావోద్వేగాన్ని ప్రచారం చేస్తున్నారని ప్రజలంతా వాటిని తిప్పి కొట్టాలన్నారు.బిజేపి వారు ఎన్నికలు వచ్చినప్పుడు మతం పేరిట రాజకీయం చేస్తున్నారని రాముడు అందరివారని దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారని గుర్తు చేశారు.
రేవంత్ రెడ్డి ఆగస్టు 15 లోపు రైతులకు రుణమాఫీ చేసి తీరుతానని అన్నారని, అది సాధ్యం కాదని హరీష్ రావు అనే మాటలు చూస్తే వారు రైతులకు రుణమాఫీ కాకుండా చేయాలని చూస్తున్నారన్నారు.హరీష్ రావు రైతు రుణమాఫీ పై సవాల్ చేస్తూ ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అన్నారని హరీష్ రావు తన రాజీనామా పత్రాన్ని సిద్ధం చేసుకోవాలని ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు.గత పది సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని అన్నారు.ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినప్పటినుండి మంత్రులంతా సమన్వయంతో అప్పులకుప్పగా ఉన్న రాష్ట్రాన్ని ఒక గాడిలో పెడుతూ, ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తారీకున జీతాలు చెల్లిస్తున్నారని, రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామని, 10 లక్షల ఆరోగ్యశ్రీని పెంచామని, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని,500 కె సిలిండర్ ఇస్తున్నామని పేర్కొన్నారు. వీటన్నిటికీ సమాధానంగా రాష్ట్రంలో ఏ విధంగానైతే బిఆర్ఎస్ ప్రభుత్వానికి గద్దె దించారో,దేశంలో కూడా బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించుతూ ఇండియా కూటమి అధికారంలోకి తేవడానికి చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.