సిద్దిపేట జిల్లా సిద్ధిపేట రూరల్ మండలం మిట్టపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధుకు ఓటు వయాలని ఇంటింటి ప్రచారాన్ని కాంగ్రెస్ నాయకులు చక్రధర్ గౌడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఐదు గ్యారెంటీలను నెరవేర్చిందని అన్నారు. పేదలు, ధనికులు, తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఇంటికి లబ్ధి చేకూరే పథకాన్ని అందించారని అన్నారు. ఉద్యోగస్తులు కూడా లబ్ధి పొందే విధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కూడా అందించారని అన్నారు. ప్రజలందరూ ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించి బడుగు బలహీన వర్గాలకు చెందిన మదుకు, చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.