హుస్నాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు


నవతెలంగాణ హుస్నాబాద్ రూరల్: హుస్నాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను గురువారం పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 138 సంవత్సరాలు గడిచిన సందర్భంగా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బడుగు బలహీన వర్గాల పేదలకు ఇల్లు, దళిత గిరిజనులకు పోడు భూములు, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అమలు చేయడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ తోనే పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.