
భారత యువజన కాంగ్రెస్ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా శుక్రవారం భీంగల్ పట్టణ కేంద్రంలో బాల్కొండ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు నాగేంద్ర బాబు ఆద్వర్యంలో పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాల్కొండ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు నాగేంద్ర బాబు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ని బలపరుస్తూ నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజలను చైతన్యపరిచి రాష్ట్రంలో అదికారం చేపట్టడానికి కీలక పాత్ర పోషించిన యువజన కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులకు ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వాక మహేష్, బాల్కొండ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సేపూర్ చరణ్ గౌడ్, భీంగల్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బద్దం అవినాష్, భీంగల్ పట్టణ అధ్యక్షులు నిచెం మహేష్, ఎన్ ఎస్ యు ఐ నియోజకవర్గ అధ్యక్షులు అక్షయ్, సతీష్, సాయిబాబ, విశాల్, సురేష్, రాజు, జేమ్స్, తదితరులు పాల్గొన్నారు.