బోర్గంలో కాంగ్రెస్ పార్టీ గడప గడపకు ప్రచారం..

నవ తెలంగాణ- రెంజల్ :  రెంజల్ మండలం బోర్గం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోబిన్ ఖాన్ అధ్యక్షతన గడపగడపకు ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన 6 గ్యారెంటీ పథకాలకు వృద్ధులు, రైతులు, మహిళలు, యువత, ఆకర్షితులై పార్టీ గెలుపొందడానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు జి సాయి రెడ్డి, ధనుంజయ్, జావిద్ ఉద్దీన్, గ్రామ అధ్యక్షులు చీరడి రవి, హనుమంతరావు, గొజ్జ భూమయ్య, సిద్ధ సాయిలు, అమీర్ బేగ్ , సాయి రెడ్డి స్థానిక రైతులు తదితరులు పాల్గొన్నారు.