
– మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బడితేల రాజయ్య
నవ తెలంగాణ- మల్హర్ రావు:
కాంగ్రెస్ పార్టీ రైతుబందు కు వ్యతిరేకం కాదని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బడితేల రాజయ్య అన్నారు. ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చాక నియమ, నిబంధనలు ఉల్లగించి కాంగ్రెస్ దిష్టిబొమ్మను దహనం చేసిన 23 మంది బీఆర్ఎస్ నాయకులపై శుక్రవారం కొయ్యుర్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసినట్లుగా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఎన్నికలు వచ్చాయని బీఆర్ఎస్ నాయకులు రైతులపై మొసలి కన్నీరు కారుస్తున్నట్టుగా చెప్పారు. రైతుల వరిదాన్యం కల్లాల్లో నెలల తరబడి ఉన్నప్పుడు ఒక్క బీఆర్ఎస్ నాయకుడు మాట్లాలేదన్నారు. తరుగు, తాలు పేరిట రైతుల శ్రమను అడ్డగోలు దోచుకున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదని ప్రశ్నించారు. రైతులు సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. నిజంగా రైతుల మీదా ప్రేమ ఉంటే నవంబర్ 2లోపు రైతుల ఖాతాల్లో డబ్బులు వేసి బీఆర్ఎస్ చిత్తశుద్ధి నిరూపించుకోవలన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ సంగ్గెం రమేష్,నాయకులు జంపయ్య, జంగిడి సమ్మయ్య, మహేష్ పాల్గొన్నారు.