నవతెలంగాణ -నకిరేకల్
రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే నకిరేకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల వీరేశం పేర్కొన్నారు. నకిరేకల్ పట్టణంలోని గుడిపాటి ఫంక్షన్ హాల్ లో నకిరేకల్ చేనేత సహకార సంఘం మాజీ అధ్యక్షులు చిలుకూరి లక్ష్మి నర్సయ్య, గంజి ఎల్లయ్య, పాపాని చంద్రయ్య, వనం నరేందర్, చిలుకూరి సుధాకర్, ముషం శ్రీనివాస్, రావిరాల దయాకర్ తో పాటు సుమారు 500 మంది పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ అధికారంలోకి రాగానే సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తామన్నారు. కేసీఆర్ పథకాలకు పది సంవత్సరాల గ్యారంటీ అయిపోయిందన్నారు. నకిరేకల్ పట్టణంలో ఇండ్లు కూలగొట్టిన తప్ప అభివృద్ధి ఏమి చేయలేదని విమర్శించారు నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.