
పెద్ద కొడంగల్ మండల ఎంపీపీ ప్రతాప్ రెడ్డి పై మండల కాంగ్రేస్ పార్టీ నాయకులు, మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి ఎంపీపీ పై ఫిర్యాదు చేశారు. వివరాలకై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్ర పటానికి చెప్పుల దండ వేసిన పోటోను సోషల్ మీడియాలో వైరల్ చేసిన ఎంపీపీ ప్రతాప్ రెడ్టి పై చర్యలు తీసుకోవాలని మండల కాంగ్రేస్ పార్టీ నాయకులు స్థానిక పొలీస్ స్టేషన్లో ఎస్ ఐ కొనారెడ్డి పిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రేస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఒక బాధ్యత యుతమైన పదవిలోఉండి.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్ర పటం చెప్పు దండ వేసిన ఫొటోను సోషల్ మీడియాలో ఎలా ప్రచారం చేస్తారో అని మండిపడ్డారు. ఈ ఘటనకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మహేందర్ రెడ్డి.మాజీ సర్పంచ్ నాగిరెడ్డి,చిప్ప మోహన్, బన్సీలాల్,సంజీవ్, రషీద్ పాష ,మారుతి,వినోద్ ,తదితరులు పాల్గొన్నారు.