నవతెలంగాణ- తాడ్వాయి : నూతనంగా వచ్చిన తాడువాయి ఎస్సై ఎన్ శ్రీకాంత్ రెడ్డిని మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గురువారం స్థానిక పోలీస్ స్టేషన్ లో కలిసి పుష్పగుచ్చం ఇచ్చి శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ననిగంటి శ్రీకాంత్ రెడ్డి గత ఎన్నో సంవత్సరాలు ఏజెన్సీ మండలాల్లో చేసి చేసి ట్రాన్స్ఫర్ పై వెళ్లి తిరిగి థర్డ్ వైర్ ఏజెంట్స్ కి రావడం సంతోష్కరం అన్నారు. రాబోయే మేడారం మహా జాతరను ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విజయవంతం చేసి అధికారుల వనదేవతల దీవెనలు ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బొల్లు దేవేందర్, స్థానిక సర్పంచ్ ఇర్ప సునీల్ దొర, పిఎసిఎస్ చైర్మన్ పులి సంపత్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు రేగ కళ్యాణి, పిఏసిఎస్ మాజీ చైర్మన్ పాక సాంబయ్య, మాజీ సర్పంచ్ లు ముజాఫర్ హుస్సేన్, బెజ్జూరి శ్రీనివాస్, మండల ఉపాధ్యక్షులు ఇప్ప నాగేశ్వరావు, డైరెక్టర్లు యానాల సిద్దిరెడ్డి, యాషాడపు మల్లన్న, రంగరబోయిన జగన్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు పీరీల వెంకన్న, నాయకులు సిద్ధబోయిన రాణా రమేష్, పాక రాజేందర్, కారంగుల రాంబాబు మొక్క శ్రీను, తండాల శ్రీను, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.