కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోబిన్ ఖాన్

నవతెలంగాణ – రెంజల్ 

కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఉపాధి హామీ కూలీలకు సమన్యాయం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మోబిన్ ఖాన్ స్పష్టం చేశారు. బుధవారం రెంజల్ మండలం వీరన్న గుట్ట గ్రామంలో ఉపాధి హామీ కూలీల వద్ద ప్రచారానికి శ్రీకారం చుట్టరు. బడుగు బలహీన వర్గాల కు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు టి జీవన్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉపాధి కూలీలకు ఆరు గ్యారెంటీ పథకాలను అమలుపరిచే విధంగా ముందుకు సాగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జి.సాయిరెడ్డి, ధనుంజయ్, సిహెచ్ రాములు, జావీదుద్దీన్, షౌకత్ హలీ, వినోద్, కార్తిక్ యాదవ్, సిద్ధ సాయిలు, ప్రభాకర్, గంగాధర్, సంజీవ్, జమాల్, ఉపాధి కూలీలు తదితరులు పాల్గొన్నారు.