నవతెలంగాణ – కమ్మర్ పల్లి
జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డిని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుంకేట రవి ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా మానాల మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పదవి కాలాన్ని పూర్తిచేసుకుని ఆరవ సంవత్సరంలోకి అడుగుతున్న శుభ సందర్భంగా ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మానాల మోహన్ రెడ్డిని శాలువా కప్పి, పుష్పగుచ్చం అందించి సుంకేట రవి సత్కరించారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంలో మానాల మోహన్ రెడ్డి కృషిని ఈ సందర్భంగా సుంకేట రవి కొనియాడారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ సెల్ జిల్లా నాయకులు అబ్దుల్ రఫీ, తదితరులు పాల్గొన్నారు.