– కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.
నవతెలంగాణ దండేపల్లి: దండేపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్సీ కోకిరాల ప్రేమ్ సాగర్ రావు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. దొండపల్లి మేదర్పేట గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా వారిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికార పార్టీ నాయకుల ఆగడాలను భరించలేకనే పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు. పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేసేందుకు గాను కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభించడం జరిగిందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే బడుగు బలహీన వర్గాల ప్రజల బ్రతుకులు బాగుపడతాయని అయన తెలిపారు. ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త బూత్ స్థాయిలో కష్టపడి పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలని అయన సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తామని దీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గడ్డం శ్రీనివాస్, రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన జిల్లా అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తి, ఎంపీటీసీలు ముత్యాల శ్రీనివాస్, కొంగల నవీన్, సర్పంచులు భుఖ్య చంద్రకళ, బిళ్ళకురి శంకరయ్య కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నేల్కి వెంకటేశ్వర్లు, నాయకులు చీటి సత్యం రావు, వెంగళరావు, బులిశెట్టి లక్ష్మీనారాయణ, బొమ్మెన మల్లేష్, గొట్ల అశోక్, గాజుల లక్ష్మి నారాయణ, కటుకురి రాజన్న, శ్రీధర్ కార్యకర్తలు పాల్గొన్నారు.